Deepika-Padukone-to-get-WEF-Crystal-award

క్రిస్టల్ అవార్డు అందుకోనున్న దీపిక.. ఎందుకో తెలుసా?

న్యూఢిల్లీ: తమ కళతో సమాజంలో మంచి మార్పులు తీసుకురావడానికి ప్రయత్నించి, సఫలమైన వారిని ప్రపంచ ఆర్ధిక వేదిక సత్కరిస్తుంది. ఇటువంటి కళాకారులను క్రిస్టల్ అవార్డును అందజేస్తుంది. ఈ ఏడాది ప్రపంచ ఆర్థిక వేదిక(డబ్ల్యూఈఎఫ్‌) అందించే క్రిస్టల్‌ అవార్డుకు నటి దీపికా పడుకోన్‌, మరో ముగ్గురు ఎంపికయ్యారు. సమాజంలో మార్పులకు ప్రేరణగా నిలిచిన కళాకారులనే ఈ అవార్డుకు ఎంపిక చేస్తారని ఈ సందర్భంగా క్రిస్టల్ అవార్డు నిర్వాహకులు తెలిపారు. ఈ అవార్డు దీపికా పదుకోన్‌తో పాటు చైనాకు చెందిన జిన్‌ జింగ్‌, థెస్టర్‌ గేట్స్‌(షికాగో), లినెట్టె వాల్‌వర్త్‌(ఆస్ర్టేలియా)ను వరించింది. మానసిక ఆరోగ్యంపై ప్రజలను చైతన్యం చేసినందుకు దీపికకు ఈ అవార్డు లభించిన్లు సమాచారం.