Dear-Comrade-Collected-30-Crore-Gross-at-the-Worldwide-Box-Office-in-1st-Weekend

ఓవర్సీస్ బాక్సాఫీస్‌ను షేక్ చేస్తున్న 'డియర్ కామ్రేడ్'

హైదరాబాద్: విజయ్ దేవరకొండ, రష్మిక మందనా జంటగా భరత్ కమ్మ దర్శకత్వంలో మైత్రీ మూవీ మేక‌ర్స్‌, బిగ్ బెన్ సినిమాస్ ప‌తాకాల‌పై తెరకెక్కిన 'డియర్ కామ్రేడ్' మూవీ ప్రపంచవ్యాప్తంగా జులై 26న విడుదలై మిశ్రమ స్పందన రాబట్టిన సంగతి తెలిసిందే. రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు కేరళ, తమిళనాడు, కర్నాటకలో ఆయా భాషల్లో ఒకేసారి భారీగా రిలీజ్ చేశారు. టాక్ ఎలా ఉన్న విజయ్ మానియాతో మూవీ బాగానే కలెక్షన్లు కొల్లగొడుతోంది. మొదటి వీకెండ్ నాటికి ఈ మూవీ కలెక్షన్లు స్టడీగా ఉండడమే దీనికి నిదర్శనం. ఫస్ట్ వీకెండ్ పూర్తి చేసుకున్న 'డియర్ కామ్రేడ్' వరల్డ్ వైడ్‌గా 60 శాతం రికవరీ చేసినట్లు సమాచారం. తొలి వీకెండ్‌లో ప్రపంచవ్యాప్ంగా సుమారు రూ. 30 కోట్ల గ్రాస్‌ను సాధించింది. ఈ మూవీని రూ.34.60 కోట్లకు కొన్న డిస్ట్రిబ్యూటర్లకు విడుదలైన తొలి మూడు రోజుల్లోనే రూ. 19.28 కోట్లు తెచ్చి పెట్టింది.

ఇక ఓవర్సీస్ ఏరియాలో ఈ చిత్రానికి మంచి స్పందన వస్తోంది. ప్రీమియర్ షోల ద్వారా $310,824(రూ.2,14,18,104) గ్రాస్ రాబట్టింది. తొలి వారంతానికి $700,000(రూ.4,82,06,200) రీచ్ అయింది. దీంతో ఓవర్సీస్‌లో విజయ్ దేవరకొండ సినిమాల్లో అత్యధిక వసూళ్లు రాబట్టిన మరో చిత్రంగా నిలిచింది. ఓవర్సీస్‌లో ఇప్పటికే విజయ్ నటించిన నాలుగు సినిమాలు(పెళ్లిచూపులు, అర్జున్‌రెడ్డి, మహానటి, గీత గోవిందం) ఒక మిలియన్ డాలర్ క్లబ్‌లో చేరాయి. ఇప్పుడు 'డియర్ కామ్రేడ్' కూడా ఒక మిలియన్ డాలర్ మార్కుకు చేరువలో ఉంది. దీంతో ఐదు.. ఒక మిలియన్ డాలర్ మార్కును దాటిన సినిమాలు కలిగిన యంగ్ హీరోగా(మహానటి, గీత గోవిందం సినిమాలు 2 మిలియన్ డాలర్ మార్కును దాటేశాయి) అరుదైన రికార్డు క్రియేట్ చేయనున్నాడు విజయ్. 'డియర్ కామ్రేడ్' చిత్రాన్ని ఓవర్సీస్‌లో ‘సరిగమ సినిమాస్’ డిస్ట్రిబ్యూట్ చేసింది.