Anushka-new-film-shooting-starts-in-Seattle

అమెరికాలో అనుష్క, మాధవన్ కొత్త చిత్ర షూటింగ్ ప్రారంభం

‘భాగమతి’ తర్వాత అనుష్క నటించే తదుపరి సినిమా ‘నిశ్శబ్దం’ షూటింగ్‌ అమెరికాలో మొదలైంది. ఈ చిత్రంలో ఆమెతో పాటు మాధవన్‌, మైఖేల్‌ మ్యాడ్‌సన్‌, అంజలి, షాలినీ పాండే, సుబ్బరాజు, అవసరాల శ్రీనివాస్‌ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. హేమంత్‌ మధుకర్‌ దర్శకత్వం వహిస్తున్నారు. పీపుల్‌ మీడియా ఫ్యాక్టరీ, కోన ఫిల్మ్‌ కార్పొరేషన్‌ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. కోన వెంకట్‌, టీజీ విశ్వప్రసాద్‌, వివేక్‌ కూచిబొట్ల నిర్మాతలు. ఈ సినిమాలో అనుష్క చెవిటి, మూగ క్యారెక్టర్‌లో నటిస్తున్నట్టు సమాచారం. థ్రిల్లర్‌ జోనర్‌లో సాగే ఈ చిత్రానికి తెలుగులో నిశ్శబ్దం అనే టైటిల్‌ను పెట్టగా.. మిగిలిన భాషల్లో ‘సైలెన్స్‌’ అనే టైటిల్‌ను నిర్ణయించారు. ఈ సినిమా మేజర్ పార్ట్‌ను అమెరికాలోనే చిత్రీకరించనున్నారు. అమెరికాలోని సియాటిల్‌లో చిత్రీకరణ ప్రారంభం కాగా.. దాదాపు 60 రోజులపాటు అమెరికాలోనే షూటింగ్ జరగనుంది. ఈ సందర్భంగా దర్శకుడు హేమంత్‌ మధుకర్‌ ట్విట్టర్‌లో వీడియో షేర్‌ చేశారు. గణేశుడి మీద తొలి షాట్‌ను చిత్రీకరించినట్టు అందులో ఉంది. ఈ చిత్రాన్ని అమెరికాలోని పలు ప్రదేశాల్లో తెరకెక్కించనున్నారు.