Ala-Vaikunthapurramuloo-has-set-an-all-time-Telugu-Record

మహేష్‌ను వెనక్కి నెట్టిన బన్నీ..!!

ఓవర్సీస్ సినిమా: సంక్రాంతికి విడుదలైన `సరిలేరు నీకెవ్వరు`, `అల వైకుంఠపురములో` చిత్రాల్లో `సరిలేరు నీకెవ్వరు` ప్రీమియర్ కలెక్షన్లను `అల వైకుంఠపురములో` క్రాస్ చేసింది. ఫుల్ పాజిటివ్ టాక్‌తో దూసుకుపోతున్న ఈ చిత్రం కలెక్షన్ల ప్రభంజనం సృష్టిస్తోంది. అమెరికాలో 'అల వైకుంఠపురములో' ఓ రేంజ్‌లో దూసుకుపోతోందనే చెప్పాలి. అమెరికాలోనే కాదు న్యూజిల్యాండ్‌లో 'అల వైకుంఠపురములో' రికార్డు క్రియేట్ చేసింది. అక్కడ 176 ప్రదేశాల్లో విడుదలైన ఈ సినిమా ఐదు షోలకే 8 లక్షల డాలర్లు వసూలు చేసింది. ఇప్పటివరకు ఏ తెలుగు సినిమాకు ఈ స్థాయిలో వసూళ్లు రాలేదు. సరిలేరు నీకెవ్వరు 252 ప్రదేశాల్లో విడుదలై 7.64 లక్షల డాలర్లు కలెక్ట్ చేసింది. సంక్రాంతికి విడుదలైన చిత్రాల్లో ఇది ఆల్ టైమ్ రికార్డ్ గా చెప్పుకోవచ్చు.