You-may-be-eating-a-credit-cards-worth-of-plastic-each-week-finds-study

ప్లాస్టిక్ తినేస్తున్నాం.. వారానికి 5 గ్రాములు కడుపులోకి..

ఆస్ట్రేలియా: ప్రపంచాన్ని ప్లాస్టిక్ పొల్యూషన్ పట్టిపీడిస్తోందని పరిశోధకులు చెబుతున్నారు. ఆస్ట్రేలియాలోని యూనివర్శిటీ ఆఫ్ న్యూకాజిల్ నిర్వహించిన సర్వేలో మనుషులు తమకు తెలీకుండానే అధిక మొత్తంలో ప్లాస్టిక్‌ను తీసుకుంటున్నట్టు తేలింది. ప్రతి మనిషి ఒక వారానికి క్రెటిడ్ కార్డు బరువంత ప్లాస్టిక్‌ను తీసుకుంటున్నట్టు పరిశోధకులు చెప్పారు. అధికశాతం ప్లాస్టిక్‌ నీళ్ల ద్వారానే శరీరంలోకి వెళుతున్నట్టు పేర్కొన్నారు. నీళ్ల ద్వారా వారానికి 1769 ప్లాస్టిక్ కణాలు మనిషి శరీరంలోకి వెళ్తున్నట్టు తెలిపారు. నీళ్ల తరువాత, షెల్‌ఫిష్(గుల్లలో ఉండే జలజీవులు) ద్వారా కూడా ప్లాస్టిక్ మనిషి శరీరంలోకి వెళ్తున్నట్టు గుర్తించారు. అమెరికాలో ట్యాప్ వాటర్ సాంపిల్స్‌ తీసుకో్గా.. అందులో 94.4 శాతం సాంపిల్స్‌లలో ప్లాస్టిక్ ఫైబర్ ఉన్నట్టు పరిశోధకులు గుర్తించారు. అంటే ప్రతి లీటర్ వాటర్‌లో 9.6 ఫైబర్లు ఉన్నాయన్నమాట. కాగా, ఈ ప్లాస్టిక్ పొల్యూషన్ యూరోపియన్ దేశాల్లోని నీళ్లలో తక్కువ శాతం నమోదైనట్టు పరిశోధకులు చెబుతున్నారు. సర్వేలో అక్కడి 72.2 శాతం వాటర్ సాంపిల్స్‌లలో మాత్రమే ఫైబర్(లీటర్ వాటర్‌లో 3.8 శాతం ఫైబర్) లభించినట్టు చెప్పారు.