Worker-beaten-to-death-in-UAE

యూఏఈలో వలసదారుడిని కొట్టి చంపిన ముఠా..

అబుధాబి: యూఏఈలో లిక్కర్ అక్రమ రవాణా చేసే ఓ ముఠా దారుణానికి పాల్పడింది. తమ ఏరియాలో లిక్కర్ వ్యాపారాన్ని ఆక్రమించడానికి వచ్చారన్న నెపంతో ఈ ఘోరానికి ఒడిగట్టింది. అబుధాబిలోని ముసఫ్ఫా ఇండస్ట్రియల్ ఏరియాలో ప్రవేశించిన ఇద్దరు మిత్రులపై.. ఆ ప్రాంతంలో లిక్కర్ అక్రమ రవాణా చేసే 12మంది ముఠా విరుచుకుపడింది. ‘మా ఏరియాలోకి ఎందుకొచ్చార్రా?’ అంటూ వారిపై ఐరన్‌రాడ్లు, కర్రలతో దాడికి దిగింది. ఈ దాడిలో ఓ వ్యక్తి మరణించగా, రెండో వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. తీవ్రంగా గాయపడిన తనను ఎడారిలో పడేశారని, స్పృహ వచ్చిన తర్వాత బంధువుల ఇంట్లో తల దాచుకున్నానని బాధితుడు చెప్పాడు. తన మిత్రుడు ఆ దాడిలో దుర్మరణం పాలయ్యాడని చెప్పాడు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. నిందితులైన 12మంది ఆసియావాసులను అరెస్టుచేశారు. ఈ కేసులో విచారణను కోర్టు అక్టోబరు 29కి వాయిదావేసింది.