Woman-Stroke-Triggered-By-Oral-Sex

ఆ సమయంలో ఆమె ఒక్కసారిగా..

లండన్: ఓ మహిళను ఆసుపత్రికి తీసుకొచ్చారు. అప్పటికే ఆమె శరీరం మొత్తం చల్లబడింది. ఆమెలో ఎటువంటి కదలిక లేదు. ఏం జరిగిందని ఆమె ప్రియుడిని డాక్టర్లు ప్రశ్నించారు. దాంతో ప్రియుడు ఏం జరిగిందో డాక్టర్లకు వివరించాడు. తామిద్దరం కలిసి ఓరల్ సెక్స్‌లో పాల్గొన్నామన్నాడు. కొద్దిసేపటి తర్వాత తన ప్రియురాలు పూర్తిగా చలనం లేకుండా కిందపడిపోయిందన్నాడు. శరీరం చల్లగా మారడంతో ఎంతో ఆందోళన చెందానని అతడు చెబుతున్నాడు. అయితే గుండె మాత్రం కొట్టుకోవడంతో ఆమెను ఆసుపత్రికి తీసుకొచ్చానన్నాడు. డాక్టర్లు ఆమెను పరీక్షించారు. ఆమె అతి సంతోషం అనుభవించడం వల్ల మెదడుకు అధిక మొత్తంలో రక్తం సరఫరా అయిందని డాక్టర్లు తెలిపారు. అందువల్ల ఆమె శరీరం మొత్తం ఎటువంటి కదలికలు లేకుండా ఉండిపోయిందన్నాడు. వైద్య పరిభాషలో ఈ స్థితిని 'ట్రాన్సెంట్ లాస్ ఆఫ్ కాన్‌షియస్‌నెస్' అని పిలుస్తారని వారు తెలిపారు. నాలుగు రోజుల తర్వాత ఆమె ఆరోగ్యం మెరుగుపడటంతో ఇంటికి పంపించామని డాక్టర్లు తెలిపారు.