Woman-Shock-after-Create-Fake-Account-to-Test-Boyfriend-Loyalty

ప్రియుడి నిజాయితీని టెస్ట్ చేయబోయిన ప్రేయసికి ఊహించని షాక్!

అక్రా(ఘనా): ఓ ప్రియురాలు తన ప్రియుడి నిజాయితీని టెస్ట్ చేద్దామనుకుంటే ఆమెకు ఊహించని షాక్ తగిలింది. నెటిజన్లు ఆమెపై విమర్శలతో విరుచుకుపడుతున్నారు. అసలేం జరిగిందంటే... ఘనాలోని అక్రాకు చెందిన అకొసుహ మే అనే యువతి గత కొంతకాలంగా ఓ యువకుడితో ప్రేమలో ఉంది. ఈ క్రమంలో అకొసుహకు తన ప్రియుడి నిజాయితీని టెస్ట్ చేయాలనిపించింది. వెంటనే ఓ ఫేక్ ట్విటర్ ఖాతాను తెరిచి అపరిచిత యువతిగా ప్రియుడితో చాట్ చేయడం మొదలెట్టింది. ఈ క్రమంలో వారి మధ్య లవ్ గురించి చర్చ వచ్చింది. యువకుడితో అకొసుహ నీకు గర్ల్‌ఫ్రెండ్ ఉందా అని అడిగింది. దాంతో యువకుడు తనకు లవర్ ఉండేదని చెప్పాడు. కాని, రెండు నెలల క్రితం అనారోగ్యంతో చనిపోయిందన్నాడు. అది విన్న అకొసుహ ఖంగుతింది. ఈ విషయాన్ని ఆమె ట్వీట్ చేయడంతో అది కాస్తా వైరల్ అయింది. ఈ పోస్టుకు 30వేల రిట్వీట్స్, లక్షకు పైగా లైక్స్ వచ్చి పడ్డాయి. అయితే, అకొసుహ చేసిన పనికి కొందరు నెటిజన్లు మండిపడుతున్నారు. 'నీకు నీ ప్రియుడిపై నమ్మకం లేదా?', 'నీవు అబద్దం చెప్పావు.. అతడు అబద్దం చెప్పాడు.. సరిపోయిందంటూ' కామెంట్లు చేస్తున్నారు. ఇంకొందరైతే 'అతడి గర్ల్‌ఫ్రెండ్ గురించి మరిన్ని వివరాలు అడిగి తెలుసుకుంటే బాగుండేదని' సలహా ఇచ్చారు. ఇప్పుడీ పోస్టు సోషల్ మీడియాలో తెగ హల్‌చల్ చేస్తోంది.