Woman-punches-perv-in-face-after-being-caught-performing-sex-act

బికినీ ఫొటోషూట్ జరుగుతుంటే.. హస్తప్రయోగం చేసుకుంటూ..

బ్రెజిల్: బహిరంగ ప్రదేశంలో హస్తప్రయోగం చేస్తున్న వ్యక్తిని అరెస్ట్ చేసిన రియో డి జనైరో పోలీసులు మందలించి వదిలేశారు. లియార అనే ఓ మహిళ ఇచ్చిన ఫిర్యాదుతో జోసెనే వియా ఫెరీరా అనే వ్యక్తిని అరెస్ట్ చేశారు. లియార అనే మహిళ పోలీసులకు తెలిపిన వివరాల ప్రకారం.. ఆమె బికినీ ఫొటో‌షూట్ కోసం రియో డి జెనైరోలోని ఓ బీచ్‌కు తన స్నేహితునితో కలిసి వెళ్లింది. బీచ్‌లో అందరూ తిరిగే ప్రదేశంలో జోసెనే వియా ఫెరీరా నిలబడి హస్తప్రయోగం చేస్తుండటం లియార గమనించింది. ఆమె బాక్సర్ కావడంతో వెంటనే ఫెర్రెరో ముఖంపై కొట్టింది. ఏం చేస్తున్నావని జోసెనే వియా ఫెరీరాను ప్రశ్నించగా.. మూత్రం పోసుకుంటున్నట్టు జవాబిచ్చాడు. ఇలాంటి వారిని మామూలుగా వదలకూడదని లియారా పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వారు జోసెనే వియా ఫెరీరాను అరెస్ట్ చేసి మందలించి వదిలేశారు. ఫెర్రెరో హస్తప్రయోగం చేస్తున్నట్టు అంగీకరించలేదు. తాను మూత్రవిసర్జన చేస్తుంటే లియారా అక్కడకు వచ్చి రాద్ధాంతం చేసిందని ఆరోపించాడు. ఫెర్రెరో వ్యాఖ్యలకు కోపం తెచ్చుకున్న లియారా ఇలాంటి వాళ్లకు కఠిన శిక్ష విధించాలంటూ మండిపడింది.