Woman-filmed-wearing-eight-pairs-of-jeans-at-once-in-a-bid-to-steal-them

దుస్తుల షాపులో దొంగతనం చేయాలని.. ఒకేసారి 8 జీన్స్ వేసుకొని..

ఇంటర్నెట్ డెస్క్: ఓ దుస్తుల దుకాణంలో దొంగతనం చేయాలనుకుందా యువతి. కస్టమర్‌లా వెళ్లి అక్కడ ఉన్న జీన్స్ ప్యాంట్లు చూసింది. వాటిని ఓసారి ట్రై చేస్తానంటూ ట్రయల్ రూమ్‌లోకి తీసుకెళ్లింది. ఆ తర్వాత మామూలుగానే బయటకు వచ్చేసింది. తనకు సరిపోయే దుస్తులు అక్కడ లేవంటూ బయటకు వెళ్లిపోబోయింది. ఎందుకో అనుమానం వచ్చిన సెక్యూరిటీ గార్డు ఆమెను అడ్డగించాడు. ఆమెను తనిఖీ చేయాలని చెప్పాడు. ఆమె ప్యాంటుపై చెయ్యి వేయగానే ఏదో తేడాగా అనిపించింది.

జాగ్రత్తగా పరిశీలిస్తే ఒకదానిపై మరోటి జీన్స్ ప్యాంట్లు ధరించినట్లు అర్థమైంది. అంతే ఆమెను బలవంతంగా వాష్‌రూమ్‌కు తీసుకెళ్లి, ప్యాంట్లన్నీ విప్పేయాలని ఆదేశించాడు. అక్కడ ఆమె ఒక్కొక్కటి చొప్పున ఎనిమిది జీన్స్‌ప్యాంటులు తీసి అతనికి తిరిగిచ్చేసింది. దీన్నంతా ఆ సెక్యూరిటీ గార్డు వీడియో తీశాడు. దాన్ని సోషల్ మీడియాలో పంచుకోగా విపరీతంగా వైరల్ అయింది. ఈ ఘటన ఎక్కడ జరిగిందీ తెలియరాలేదు. ఈ వీడియోపై నెటిజన్లు రకరకాల కామెంట్లు చేస్తున్నారు.