Woman-facing-charges-for-starving-2-dogs-locked-in-a-cage-together,-1-eats-the-other

కుక్క చేత కుక్కనే తినిపించిన అమెరికా మహిళ.. అరెస్ట్

ఒహియో: అమెరికాలోని ఒహియో ప్రాంతానికి చెందిన జెస్సికా అనే యువతి రెండు మూగజీవులను పస్తు ఉంచింది. రెండు వివిధ బ్రీడ్‌లకు చెందిన కుక్కలను ఒకే బోనులో బంధించి వాటికి ఆహారం పెట్టకుండా చిత్రహింసలు పెట్టి రాక్షసానందాన్ని పొందింది. రెండు కుక్కలలో ఒక కుక్క ఆకలితో మరణించగా.. మరో కుక్కను చనిపోయిన కుక్కను తినేలా చేసింది. తన ప్రాణాలను కాపాడుకోడానికి మరో మార్గం లేక రెండో కుక్క చనిపోయిన మొదటి కుక్కను తినాల్సి వచ్చింది. ఏప్రిల్ 5న జరిగిన ఈ ఘటన రెండు రోజుల తరువాత వెలుగులోకి రావడంతో.. పోలీసులు ఏప్రిల్ 8న జెస్సికాను అరెస్ట్ చేశారు. మూగజీవులను హింసించినందుకు, చనిపోవడానికి కారణమైనందుకు ఆమెపై రెండు కేసులను పెట్టారు. త్వరలో ఆమె కేసు కోర్టుకు రానుంది.