Woman-bites-off-mans-tongue

యువతిపై అత్యాచారం చేద్దామనుకుని.. చివరకు..

సౌత్‌ఆఫ్రికా: నిద్రపోతున్న యువతిపై ఓ వ్యక్తి అత్యాచారయత్నం చేయగా.. అతడి నుంచి తనను తాను రక్షించుకునేందుకు యువతి ఆ వ్యక్తి నాలుకను కొరికేసింది. 24 ఏళ్ల యువతి ఓ ఆసుపత్రిలో డాక్టర్‌గా పనిచేస్తోంది. రాత్రి సమయంలో ఆసుపత్రికి సంబంధించిన క్వార్టర్స్‌లోనే యువతి నిద్రపోతుండగా అదే ఆసుపత్రిలోని ఓ పేషంట్ ఆమెపై అత్యాచారయత్నం చేశాడు. ఆమె పెదవులపై ముద్దు పెట్టుకోడానికి ప్రయత్నించగా.. తనను తాను రక్షించుకోడానికి యువతి అతడి నాలుకను కొరికేసింది. దీంతో ఆ వ్యక్తి నాలుక దాదాపు ముక్కలు ముక్కలుగా విడిపోయింది. పోలీసులు అతడిపై కేసు నమోదు చేసుకుని ఆసుపత్రికి తీసుకెళ్లారు. ప్రస్తుతం అతడి నాలుకకు ప్లాస్టిక్ సర్జరీ చేసి తిరిగి అమర్చనున్నట్టు తెలుస్తోంది. నిందితుడు కోలుకున్న తర్వాత అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరుస్తామని పోలీసులు తెలిపారు. కాగా, సౌత్ ఆఫ్రికాలో అమ్మాయిలపై అత్యాచారం అనేది సహజంగా మారిపోయింది. 2017 నుంచి 2018 వరకు దాదాపు 40 వేల మంది మహిళలపై అత్యాచారం జరిగినట్టు అధికారులు చెబుతున్నారు. కానీ, ఫిర్యాదు చేయడానికి మహిళలు ముందుకు రావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. అత్యాచారానికి గురైన ప్రతి నలుగురు మహిళలలో కేవలం ఒక్కరే పోలీసులను ఆశ్రయిస్తున్నారని తెలిపారు.