Violent-Turbulence-Hits-ALK-Airlines-Flight

విమానంలో అల్లకల్లోలం.. ప్రయాణీకుల ప్రార్థనలు.. వీడియో వైరల్...

స్విట్జర్లాండ్: గాల్లో ప్రాణాలు గాల్లోనే కలిసిపోయేలా ఉన్నాయి దేవుడా.. ఎలాగైన మమ్మల్ని నీవే కాపాడాలని ఏఏల్‌కే ఎయిర్‌లైన్స్ విమానంలో ప్రయాణిస్తున్న సుమారు 121 మంది ప్రయాణీకులు దేవుడ్ని ప్రార్థించిన క్షణాలవి. ప్రిస్టినా,కొసొవో నుంచి బసెల్ స్విట్జర్లాండ్ వెళ్తున్న విమానం ఇంకో అర్ధగంటలో ల్యాండ్ అవుతుందనగా ఒక్కసారిగా వచ్చిన కుదుపుల వల్ల లోపల అల్లకల్లోల వాతావరణం నెలకొంది. అయితే, పైలట్ చాకచక్యంగా వ్యవహరించడంతో ప్రమాదం తప్పింది. వీడియోలోని దృశ్యాల ఆధారంగా... కుదుపులకు విమానంలోని సీట్లు సైతం కదలడం మనం గమనించ వచ్చు. విమాన సహాయకురాలి వేడి నీటి బాటిల్‌లోని నీరు ప్రయాణికులపై పడడం, వేడిగా ఉందంటూ ప్రయాణీకులు అరవడం వీడియోలో ఉంది. ఆ సమయంలో ఓ ప్రయాణీకురాలు దేవుడ్ని ప్రార్థించడం కూడా వీడియోలో చూడొచ్చు. ఈ సంఘటన జరిగినప్పుడు విమానం ఫ్రెంచ్-స్విస్-జర్మన్ సరిహద్దులో ఉంది. ఇంకో 30 నిమిషాల్లో విమానం ల్యాండ్ అవుతుందనగా ఈ సంఘటన చోటుచేసుకున్నట్లు ప్రయాణీకులు తెలిపారు. కాగా, ఈ ఘటనలో స్వల్పంగా గాయపడిన 10 మంది ప్రయాణీకులను విమానం ల్యాండ్ అయిన తరువాత చికిత్స కోసం సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ఈ భయంకర ఘటనకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 

(వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి)