Uttam-kumar-reddy-to-visit-duvbai

దుబాయ్ వెళ్లనున్న పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి

హైదరాబాద్: టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి, కుంతియా ఈ రోజు రాత్రి దుబాయి వెళ్లనున్నారు. దుబాయిలో జరగనున్న తెలంగాణ ఎన్నారైలతో మేనిఫెస్టో సమావేశంలో ఇరువురూ పాల్గోననున్నారు. ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇవ్వాలని ఎన్నారైలను కాంగ్రెస్ నేతలు కోరనున్నారు. ఇదిలావుండగా తెలంగాణ ఎన్నికలను ఎన్నారైలు ప్రత్యక్షంగా, పరోక్షంగా ప్రభావితం చేయనున్నారు. పదుల సంఖ్యలో స్థానాలను ప్రభావితం చేయనున్నారు. అందుకే ఎన్నారైలను ఆకట్టుకునేందుకు అన్నీ పార్టీలు వ్యూహాలను సిద్ధం చేసుకుంటున్నాయి.