US-woman-treated-by-doctors-after-blood-turned-navy

నీరసంగా ఉందంటూ వచ్చిన యువతి.. రక్త పరీక్ష చేసిన డాక్టర్లు షాక్.. ఎందుకంటే..

రోడ్ ఐలాండ్: ఓ పాతికేళ్ల యువతి సడెన్‌గా అమెరికాలోని రోడ్ ఐలాండ్ రాష్ట్రంలో ఆస్పత్రికి వచ్చింది. తనకు ఒంట్లో బాగాలేదని, చాలా నీరసంగా ఉందని అక్కడి వైద్యులకు చెప్పింది. ఆమె కళ్లు, చేతి గోర్లు రంగు తేడాగా ఉండటం గమనించిన వైద్యులు వెంటనే వైద్య పరీక్షలు చేయాలని నిర్ణయించారు. దానికోసం ఆమె రక్తనమూనా తీసుకోబోయారు. అంతే వారి నోటమాట రాలేదు. ఎందుకంటే ఆమె రక్తం అందరిలా ఎర్రగాలేదు. ముదురు నీలం రంగులో సినిమాల్లో చూపించినట్లు ఉంది.

అది చూసిన ఓటిస్ వారెన్ అనే వైద్యుడు.. ఆమె ఏదో మందు వేసుకోవడం వల్లే ఈ పరిస్థితి తలెత్తిందని గ్రహించాడు. ఈ విషయమై ఆమెను ప్రశ్నించగా.. తనకు పన్నుపోటు బాగా ఉందని, దాంతో ఓ మందు వాడుతున్నానని చెప్పింది. ఆమె వాడిన మందులో బెంజోకైన్ అనే పదార్థం ఉందని, దాని మోతాదు ఎక్కువ అవడం వల్లే ఆమె రక్తం నీలం రంగులోకి మారిందని వారెన్ చెప్పారు. ఈ వ్యాధిని మెథామొగ్లోబినీమియా అంటారని తెలిపారు.