US-train-hits-indian-boy-while-he-was-going-to-school

మర్చిపోయిన పుస్తకం కోసం ఇంటికొచ్చిన కుర్రాడు.. స్కూల్‌కు తిరిగెళ్తుండగా..

న్యూయార్క్: జాన్ సాబు అనే 15 ఏళ్ల కుర్రాడు.. అమెరికాలోని హాలెట్‌ హైస్కూల్లో చదువుకుంటున్నాడు. అతని తల్లిదండ్రులు డాక్టర్ సాబు, మేరీ ఇక్కడే ఉద్యోగాలు చేసుకుంటున్నారు. కేరళకు చెందిన వీరిద్దరూ కొంతకాలం క్రితమే అమెరికా వెళ్లి స్థిరపడ్డారు. ప్రతిరోజూ జాన్‌ను తల్లిదండ్రులే స్కూల్లో దింపుతారు. రోజూలాగే శుక్రవారం కూడా జాన్‌ను స్కూల్లో దింపిన వారు.. ఆఫీసులకు వెళ్లిపోయారు. అయితే స్కూలుకు వెళ్లిన తర్వాత ఓ ముఖ్యమైన నోట్స్ తాను ఇంట్లోనే మర్చిపోయినట్లు జాన్ గుర్తించాడు. దాంతో మళ్లీ ఇంటికి వచ్చాడు. ఇంట్లో ఎవరూ లేకపోవడంతో తన వద్దనున్న తాళంతో ఇంట్లో ప్రవేశించాడు. నోట్స్ తీసుకొని తిరిగి స్కూలుకు బయలుదేరాడు. అప్పటికే ఆలస్యమవడంతో ఆదరాబాదరాగా పరిగెత్తాడు. మార్గమధ్యంలో ఓ రైల్‌రోడ్‌ను వేగంగా దాటబోయాడు. అదే సమయంలో దూసుకొచ్చిన రైలు.. జాన్‌ను బలంగా ఢీకొట్టింది. దాంతో జాన్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. ఈ విషయం తెలిసిన జాన్ తల్లిదండ్రులు గుండెలవిసేలా రోదించారు. ఓల్డ్ బెత్‌పేజ్‌‌లోని సెయింట్ మేరీస్ సైరో మలబార్ కేథలిక్ చర్చిలో మంగళవారం జాన్ అంత్యక్రియలు నిర్వహించారు.

Related Articles