US-immigration-agency-to-close-its-overseas-offices

ఇమ్మిగ్రేషన్ కార్యాలయాలను మూసివేసే దిశగా అమెరికా అడుగులు

వాషింగ్టన్‌/న్యూయార్క్‌: విదేశాల్లోని తమ ఇమ్మిగ్రేషన్‌ కార్యాలయాలను మూసివేసే దిశగా అమెరికా అడుగులు వేస్తోంది. విదేశాల్లో కార్యాలయాలు నిర్వహించడం కంటే స్థానిక కార్యాలయాల్లోనే సమస్యలను పరిష్కరించడం ఉత్తమమని, ఈ నిర్ణయం ద్వారా కోట్లాది రూపాయలు ఆదా అవుతాయని హోంల్యాండ్‌ సెక్యూరిటీ విభాగం అధికారులు భావిస్తున్నట్లు సమాచారం. 20 దేశాల్లోని కార్యాలయాలను మూసివేసే అంశంపై ప్రాథమికంగా చర్చలు నడుస్తున్నాయని యూఎస్‌ సిటిజన్‌షిప్‌ అండ్‌ ఇమ్మిగ్రేషన్‌ సర్వీసెస్‌ అధికార ప్రతినిధి తెలిపారు. భారత్‌, బ్రిటన్‌, మెక్సికో, దక్షిణాఫ్రికా, ఇటలీ, ఫిలిప్పీన్స్‌ తదితర దేశాల్లోని అమెరికా ఇమ్మిగ్రేషన్‌ కార్యాలయాల్లో 70 మందికి పైగా ఉద్యోగులు పనిచేస్తున్నారు.