US-cop-draws-gun-after-girl-stole-Barbie-worth-80p

బార్బీ బొమ్మ దొంగిలించిన నాలుగేళ్ల పాప.. కాల్చి పారేస్తానన్న పోలీస్..

అరిజోనా: అమెరికాలోని అరిజోనాలో షాపింగ్‌కు వెళ్లిందా నల్లజాతి కుటుంబం. తల్లిదండ్రులతోపాటుగా వెళ్లిన వారి నాలుగేళ్ల పెద్ద కూతురు మాల్‌లో ఉన్న ఓ బార్బీ బొమ్మపై మనసుపారేసుకుంది. దాన్ని కొనివ్వాలని అడిగినా తల్లిదండ్రులు కొనివ్వకపోవడంతో.. దాన్ని తీసుకొని డ్రెస్‌లో దాచేసుకుంది. ఈ విషయం తెలియని ఆమెస్, హార్పర్ దంపతులు బిల్ చెల్లించి వెళ్లిపోయారు. అక్కడకు దగ్గరలోనే ఉండే వారి పిల్లల బేబీసిట్టర్ ఇంటికెళ్లారు. అక్కడకు వెళ్లిన వారిపై ఓ పోలీసాఫీసర్ తుపాకీ గురిపెట్టాడు. ఆమెస్‌ను కారు దిగాలని, లేదంటే కాల్చిపారేస్తానని బెదిరించాడు. అతను కారు దిగగానే కిందపడేసి, అతని చేతులకు బేడీలు వేశాడు. పోలీసు కారులోకి తోసి, కాలుతో తన్నాడు. పిల్లల తల్లి హార్పర్‌ను కూడా అసభ్యకరంగా నిందించాడు. వారిద్దరినీ అరెస్టుచేశాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. విషయం తెలుసుకున్న జే జీస్ రాక్ నేషన్ సంస్థ బార్బీ బొమ్మ ఖరీదు 80 పౌండ్లు (సుమారు రూ.7 వేలు) చెల్లించడానికి అంగీకరించింది. అయితే ఈ విషయాన్ని అక్కడితో వదిలే ప్రసక్తిలేదని, ఆ పోలీసు అధికారి ప్రవర్తన దారుణంగా ఉందని తెలిపింది. ఫీనిక్స్ ప్రాంత పోలీస్ డిపార్ట్‌మెంటుపై బాధితులు పరువునష్టం దావా వేశారు.