US-and-India-can-make-the-world-a-better-place

‘భారత్, అమెరికా కలిస్తే.. ప్రపంచమే మారిపోతుంది..’

వాషింగ్టన్: భారత్, అమెరికా కలిస్తే ప్రపంచాన్ని మెరుగైన ప్రదేశంగా మార్చవచ్చని అమెరికా ఎనర్జీ సెక్యూరిటీ విభాగం కార్యదర్శి రిక్ పెర్రీ అన్నారు. ఎనర్జీ సెక్యూరిటీ రంగం ఎంతో కీలకమైందని, ఈ రంగంలో భారత్, అమెరికా ఒకదానికొకటి సహకరించుకోవాలని ఆయన కోరారు. యూఎస్-ఇండియా వ్యూహాత్మక భాగస్వామ్యం గురించి సిస్కో మాజీ సీఈవో జాన్ ఛాంబర్స్‌తో ముచ్చటిస్తూ పెర్రీ ఈ వ్యాఖ్యలు చేశారు. ఇటీవల ఇరుదేశాల మధ్య వాణిజ్యపరంగా తలెత్తిన మనస్పర్థల విషయంలో చర్చలు జరిపేందుకు అమెరికాకు చెందిన ప్రతినిధి ఢిల్లీకి చేరుకున్నారు. ఈ సమయంలో పెర్రీ ఇరుదేశాల భాగస్వామ్యంపై చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.

Related Articles