ugadi-sambaraalu-in-chicago

సీటీఏ, నాట్స్ ఆధ్వర్యంలో ఉగాది ఉత్సవాలు

అరోరా: అమెరికాలోని తెలుగుజాతిని ఒక్కటి చేస్తున్న నాట్స్.. చికాగోలో ఉగాది ఉత్సవాలను ఘనంగా నిర్వహించింది. చికాగోలోని స్థానిక తెలుగు సంఘం సీటీఏతో కలిసి ఈ వేడుకలు జరిపింది. హేమలంబి నామ సంవత్సరానికి స్వాగతం పలుకుతూ తెలుగువారంతా సంబరాలు జరుపుకున్నారు. తెలుగు కళా సంప్రదాయాలకు పెద్ద పీట వేస్తూ స్థానిక అరోరా శ్రీ వెంకటేశ్వర స్వామి సన్నిధిలో వేడుకలు జరిగాయి. స్థానిక తెలుగు కళకారులు ఈ ఉగాది ఉత్సవాల కోసం ముందే సన్నద్దమై ప్రదర్శనలు ఇచ్చారు. తెలుగు ఆట, తెలుగు పాట ఉగాది సంబరాల్లో ప్రతిబింబించాయి. సీటీఏ, నాట్స్ ప్రతినిధులు ఈ సంబరాల్లో పాలుపంచుకున్నారు. ముఖ్యంగా మహిళలు, చిన్నారులు ఎంతో ఉత్సాహంగా ఉగాది వేడుకల్లో పాల్గొన్నారు. ప్రదర్శనలు ఇచ్చిన  కళకారులను, కార్యక్రమ నిర్వహణకు సహకరించిన వాలంటీర్లను నాట్స్, సీటీఏ ప్రత్యేకంగా అభినందించాయి. విజేతలకు బహుమతులను అందచేశారు.