TRS-australia-president-meets-with-central-minister-kishan-reddy

కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని కలిసిన టీఆర్‌ఎస్ ఆస్ట్రేలియా అధ్యక్షుడు

కాన్‌బెర్రా: ఉగ్రవాదంపై జరిగిన ప్రపంచ స్థాయి సదస్సులో పాల్గొనడానికి ఆస్ట్రేలియా విచ్చేసిన కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డిని మెల్‌బోర్న్‌లో జరిగిన కార్యక్రమంలో టీఆర్ఎస్ ఆస్ట్రేలియా అధ్యక్షుడు కాసర్ల నాగేందర్ రెడ్డి కలిశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. నిజామాబాద్‌లో పసుపు బోర్డును త్వరితగతిన ఏర్పాటు చేయాలని, ఆర్టీసీకి సంబంధించి కేంద్ర ప్రభుత్వం విధిస్తున్న సుంకాలను మాఫీ చేయాలని కోరుతూ వినతి పత్రం అందజేశారు. విభజన చట్టంలో తెలంగాణ రాష్ట్రానికి ఇచ్చిన హామీలను నెరవేర్చే దిశగా పోరాడాలని కోరారు. మంత్రిని కలిసిన వారిలో నాగేందర్ రెడ్డితోపాటు సాయిరాం ఉప్పు , సాయి యాదవ్, రామకృష్ణ ద్యావనపల్లి, అరుణ్ రెడ్డి తదితరులు ఉన్నారు.