Tornadoes-effect

సోషల్ మీడియా ప్రభావంతో..

సిడ్నీ: వరుస టోర్నడోలు ఆస్ట్రేలియాను అతలాకుతలం చేస్తున్నాయి. టోర్నడోల వల్ల జరుగుతున్న బీభత్సం కంటే సోషల్ మీడియాలో వాటి గురించి జరుగుతున్న ప్రచారమే ఎక్కువ నష్టాన్ని కలిగిస్తుందని అధికారులు చెబుతున్నారు. సోషల్ మీడియా యూజర్లు టోర్నడోలకు సంబంధించిన ఫోటోలు, వీడియోలను షేర్ చేసే విధానం చూస్తుంటే సామాన్య ప్రజలు తీవ్ర భయాందోళలకు గురయ్యే అవకాశం ఉందన్నారు.

చాలా సందర్భాల్లో టోర్నడోలకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సహజత్వానికి దూరంగా ఉంటున్నాయని అధికారులు అభిప్రాయపడుతున్నారు. అయితే సోషల్ మీడియా వల్ల టోర్నడోలకు సంబంధించిన హెచ్చరికలు మాత్రం ప్రజలకు సమర్థవంతంగా  అందుతున్నాయని అధికారులు చెబుతున్నారు.