Tiktok-video-changed-her-life-to-get-better

ఆ 15సెకన్ల టిక్‌టాక్ వీడియో.. ఆమె జీవితాన్నే మార్చేసింది.. ఎలాగో తెలుసా?

లండన్: సోషల్ మీడియా ప్లాట్‌‌ఫారం ఏ వ్యక్తిని ఎప్పడు అందలం ఎక్కిస్తుందో ఎవరూ చెప్పలేరు. దీనికి ఉదాహరణగా తాజాగా 23 ఏళ్ల యువతి నిలిచింది. ఈ యువతికి టిక్ టాక్‌లో ఏకంగా 1.6 కోట్ల అభిమానులు ఉన్నారు. టిక్‌టాక్‌లో ఫేమస్ అయిన కారణంగా ఆమె జీవితం అమాంతం మారిపోయింది. బ్రిటన్‌కు చెందిన ఈ యువతి పేరు హోలీ హార్న్. ఆకర్షణీయమైన కళ్లతో, అందమైన మోమును కెమెరావైపు చూపిస్తూ ఈమె విజిల్ వేస్తుంది. దీనిని చూసినవారంతా ఆమెకు ఫిదా అయిపోయారు.

15 సెకెన్లున్న ఈ ‘టిక్‌టాక్’ వీడియో ఆమెను పెద్ద స్టార్‌గా మార్చేసింది. ఆ తరువాత ఆమె టిక్‌టాక్ ద్వారా చేస్తున్న వీడియోలు ఆమెను కోటీశ్వరురాలిని చేశాయి. మీడియాకు అందిన సమాచారం ప్రకారం ఆమెకు పలు ప్రకటనల్లో నటించేందుకు లెక్కకు మించిన ఆఫర్లు వస్తున్నాయి. కాగా ఇంతవరకూ అన్నాచెల్లెళ్లతో కలసిమెలసివున్న హోలీ ఇప్పుడు లండన్‌కు సమీపంలోని వెస్ట్ రసెక్స్‌లో గల నాలుగు బెడ్ రూములు కలిగిన బిల్డింగ్‌లోకి షిఫ్ట్ అయ్యింది. దీనితో పాటు తన సంరక్షణకు బాడీ గార్డుల టీమ్‌ను ఏర్పాటు చేసుకుంది.