Thieves-Run-away-with-Man-Bag-they-Shocked-after-to-Find-4-Pythons-Inside-It

వ్యక్తి బ్యాగు ఎత్తుకెళ్లిన దొంగలు.. ఇంతకు ఆ సంచిలో ఏముందో తెలిస్తే షాకవుతారు

కాలిఫోర్నియా: అమెరికాలోని కాలిఫోర్నియా రాష్ట్రం సాన్ జోస్‌లో శనివారం ఓ వ్యక్తి వద్ద నుంచి దొంగలు ఒక బ్యాగును దొంగలించారు. దొంగలు పట్టుకెళ్లిన ఆ బ్యాగులో విలువైన వస్తువులో, డబ్బులో లేవు. అందులో ఏమున్నాయో తెలుసా? ఒక బల్లితో పాటు నాలుగు సర్పాలు. అవును మీరు విన్నది నిజమే. దొంగలు ఎత్తుకెళ్లిన ఆ బ్యాగులో సుమారు రూ. 3లక్షల 56 వేలు విలువ చేసే  ప్రత్యేకమైన జాతికి చెందిన బల్లి, నాలుగు పాములు ఉన్నాయని బాధితుడు ఆదివారం ఆన్‌లైన్ ద్వారా పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ వార్త బయటకు వచ్చింది. కాంప్బెల్‌లో బ్రియాన్ గుండి అనే వ్యక్తి సర్పాల మంచికోసం స్థానికంగా స్నేక్ డ్యూకేషనల్ బిజినెస్ నిర్వహిస్తున్నాడు. దీనిలో భాగంగా శనివారం మధ్యాహ్నం స్థానికంగా ఉన్న ఓ లైబ్రరీలో ఐదు సరీసృపాలను తీసుకెళ్లి ఒక ప్రదర్శన నిర్వహించాడు.

ఈ ప్రదర్శన అనంతరం ఒక బ్యాగులో ఆ ఐదు సరీసృపాలను పెట్టి  పార్కింగ్‌లో ఉన్న కారును తీసుకురావడానికి వెళ్లాడు. కేవలం కారుకు 150 అడుగుల దూరంలో బ్యాగును ఉంచి వెళ్లాడు బ్రియాన్. కారు దగ్గరికి వెళ్లి వెనక తిరిగి చూస్తే బ్యాగు కనిపించలేదు. అదే సమయంలో కొందరు వ్యక్తు ఆ బ్యాగు ఎత్తుకొని పరిగెత్తడం అతడు చూశాడు. దాంతో బ్రియాన్ వారిని వెంబడించిన ఫలితం లేకుండా పోయింది. దీంతో ఆదివారం ఆయన ఆన్‌లైన్‌లో పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దొంగలు ఎత్తుకెళ్లిన పాములు విషపూరితమైనవి కావని, వాటికి ఎలాంటి హాని తలపెట్టొదని ఆయన కోరారు. సరీసృపాలతో ఉన్న ఆ సంచిని దొంగలించిన వ్యక్తులు దానిని తెరిచి చూసిన తర్వాత వారి పరిస్థితి ఏంటో ఊహించగలను. కానీ అవి మీకు ఎలాంటి హాని కలిగించవు. కనుక వాటిని జాగ్రత్తగా తన చిరునామాకు తెచ్చివ్వగలరని ఆయన విజ్ఞప్తి చేశారు.