That-is-Americas-biggest-mistake-says-Trump

అదే అమెరికా చేసిన అతిపెద్ద తప్పు.. ట్రంప్ సంచలన వ్యాఖ్యలు..

వాషింగ్టన్: మధ్యప్రాచ్యంలో సైనిక శక్తి వినియోగించడం అమెరికా చేసిన అతి పెద్ద తప్పిదమని ఆ దేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యానించారు. అమెరికా దళాలను క్షేమంగా స్వదేశానికి రప్పించేందుకు తాను కృషి చేస్తున్నట్టు ఆయన తెలిపారు. సిరియాలో విధుల్లో ఉన్న స్పెషల్ ఆపరేటర్లను వెనక్కు రప్పించాలన్న ఆయన నిర్ణయం పలు విమర్శలకు దారి తీసిన నేపథ్యంలో ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేశారు.

‘మధ్యప్రాచ్యంలో పరిస్థితులను చక్కదిద్దేందుకు అమెరికా ఇప్పటికే 8 లక్షల కోట్ల డాలర్లు( రూ.5.6 కోట్ల కోట్లు) ఖర్చుచేసింది. ప్రాణాలు పోగొట్టుకున్న సైనికులు, క్షతగాత్రుల సంఖ్య వేలల్లో ఉంది. ఈ ప్రాంతంలో పరిస్థితులు చక్కదిద్దాలనుకోవడం అమెరికా చేసిన పెద్ద తప్పిదం" అని ట్రంప్ ట్వీట్ చేశారు.