Texas-women-gives-birth-to-Sextuplets

ఒకే కాన్పులో ఆరుగురు పిల్లలు.. హోస్టన్‌లో అరుదైన అద్భుతం

హోస్టన్: ఓ కాన్పులో ఇద్దరు పిల్లలు పుడితేనే అద్భుతంగా చెప్పుకుంటాం. అలాంటిది ముగ్గురు పుడితే అమ్మో అంటాం. అదే ఏకంగా ఆరుగురు పుడితే వినగానే షాకవుతాం. ఎందుకంటే అది అత్యంత అరుదుగా జరిగే ఘటన. 470 కోట్ల మందిలో ఒక్కరికి మాత్రమే అలా ఒకే కాన్పులో ఆరుగురు పిల్లలు పుట్టే అవకాశం ఉంది. హోస్టన్‌కు చెందిన ఓ మహిళ ఈ అరుదైన ఘనత సాధించింది. తెల్మా చికా అనే ఓ మహిళకు శుక్రవారం ఉదయం 4.30 గంటలకు పురిటి నొప్పులు వచ్చాయి. సరిగ్గా 4.50కి ఆమె మొదటగా ఇద్దరు మగపిల్లలు పుట్టారు. ఆ తర్వాత కాసేపటికి మరో ఇద్దరు అబ్బాయిలకు, వెంటనే ఇద్దరు అమ్మాయిలకు జన్మనిచ్చింది. చాలా అరుదుగా జరిగే ఇలాంటి కాన్పు తమ ఆస్పత్రిలో జరగడం పట్ల టెక్సాస్ మహిళా ఆస్పత్రి వర్గాలు హర్షం వ్యక్తం చేశాయి. తెల్మా, ఆమె సంతానం అందరి ఆరోగ్యాలూ నిలకడగా ఉన్నాయని, ఎటువంటి ప్రమాదమూ లేదని చెప్పారు. ఆడ పిల్లలకు జీనా, జురియెల్ అని పేర్లు పెట్టిన తెల్మా.. అబ్బాయిల ఏ పేర్లు పెట్టాలా అని ఆలోచిస్తోంది.