Texas-Man-Playing-with-Snake-in-Street-

ఆరడగుల పాముతో ఆడుకుంటోంటే.. అనూహ్య ఘటన...

శాన్ ఆంటోనియో: పాముతో ఆడుకుంటున్న ఓ వ్యక్తికి అనూహ్య ఘటన ఎదురైంది. ప్రమాదవశాత్తు అతడు రోడ్డు ప్రమాదానికి గురయ్యాడు. ఈ సంఘటన టెక్సాస్‌లోని శాన్ ఆంటోనియోలో చోటుచేసుకుంది. ఓ వీధిలో ఆరడుగుల పాముతో ఆడుకుంటున్న 30 ఏళ్ల వ్యక్తిని ట్రక్కు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆ వ్యక్తికి స్వల్ప గాయాలయ్యాయి. సోమవారం రాత్రి 10 గంటల ప్రాంతంలో శాన్ ఆంటోనియో ఈ దుర్ఘటన జరిగింది. కాగా, గాయపడిన వ్యక్తిని చికిత్స కోసం ఆస్పత్రికి తీసుకెళ్లేందుకు యత్నించగా అతడు నిరాకరించినట్లు టెక్సాస్ పోలీసులు తెలిపారు.