Texas-House-Approved-Senate-Bill-21

టెక్సాస్‌లో కొత్త చట్టం.. ఇకపై 21ఏళ్లకు పైబడి వయసున్నవారే..

టెక్సాస్‌: అమెరికాలోని టెక్సాస్ రాష్ట్రంలో దుమపానంపై కొత్త చట్టం తీసుకువచ్చేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. ఇకపై 21ఏళ్లకు పైబడి వయసున్నవారే పొగాకు ఉత్పత్తులు కొనుగోలు చేసేలా కొత్త చట్టం తీసుకురానుంది. స్మోకింగ్ చేసేవారి వయసు 18 నుంచి 21 పెంచాలనేది ఈ చట్టం ముఖ్య ఉద్దేశం. ఈ నేపథ్యంలో టెక్సాస్‌ హౌస్‌ ప్రతినిధులు 'సెనేట్ బిల్ 21' పేరిట ఓ బిల్‌కు ఆమోదం తెలిపారు. ఈ బిల్‌లో పొగాకు ఉత్పత్తులు కొనేవారి కనీస వయసు 21 ఉండాలని పేర్కొన్నారు. ఇందులో ఈ-సిగరేట్‌ను కూడా చేర్చారు. 'సెనేట్ బిల్ 21' బిల్ కనుక ఆమోదం పొందితే పొగాకు ఉత్పత్తులు కొనేవారి కనీస వయసు 21 పెంచిన 13వ రాష్ట్రంగా టెక్సాస్ నిలవనుంది. ఇంతకుముందే అమెరికాలో ఇలా 12 రాష్ట్రాలు పొగాకు ఉత్పత్తులు కొనేవారి కనీస వయసు 21గా ఉండాలనే చట్టాన్ని ఆమలు చేస్తున్నాయి. కాగా, మాట్ స్కేఫర్ అనే ఓ ప్రతినిధి మాత్రం ఈ బిల్ నుంచి 18 ఏళ్లకు పైబడి, డ్యూటీ చేస్తున్న మిలిటరీ మెంబర్స్‌కు వారి వాలిడ్ ఐడి ప్రూఫ్ చూపించి సిగరెట్, ఈ-సిగరెట్, పొగాకు ఉత్పత్తులను కొనుక్కునేల మినహాయింపు ఇవ్వాలని కోరారు. ఒకవేళ ఈ మినహాయింపుతో కనుకు టెక్సాక్ ఈ బిల్‌ను ఆమెదిస్తే ఇలా అక్టివ్ మిలిటరీ మెంబర్స్‌కు మినహాయింపుతో చట్టం చేసిన మూడో రాష్ట్రం కానుంది.