Terrifying-moment-mysterious-fog-completely-fills-Delta-plane

విమానం నిండా పొగలు.. సిబ్బంది చెప్పిన కారణం విని ప్రయాణికులు షాక్..

ఫ్లోరిడా: న్యూయార్క్ వెళ్లడానికి సిద్ధంగా ఉన్న ఆ విమానం ఒక్కసారిగా పొగలతో నిండిపోయింది. దీంతో దానిలోని ప్రయాణికులంతా భయంతో గజగజలాడిపోయారు. ఏం జరుగుతుందో అర్థంకాక దిక్కులు చూస్తూ విమాన సిబ్బందిని పిలిచారు. హాలోవీన్(ఇంగ్లీషువారు చేసుకునే ఓ పండగ) కోసం చేయాల్సిన పనిని ట్రయల్ వేస్తున్నామని, భయపడాల్సిన అవసరం లేదని సిబ్బంది చెప్పారు. కానీ ఎంతసేపటికీ ఆ పొగ తగ్గకపోవడంతో ప్రయాణికులకు అనుమానం వచ్చింది. ఏం జరుగుతుందంటూ సిబ్బందిని గట్టిగా ప్రశ్నిచంగా.. విమానంలోని తేమ వల్ల ఇలా జరిగిందని చెప్పారు. ప్రయాణికులకు కలిగిన అసౌకర్యానికి క్షమాపణలు చెప్పారు. అంతే కొందరు ప్రయాణికులు సిబ్బందిని చెడామడా తిట్టేశారు. జరిగింది చెప్పకుండా హాలోవీన్ అంటూ జోకులేస్తారా? అంటూ నిలదీశారు. ఈ ఘటన అమెరికాలోని ఫ్లోరిడా నగరంలో జరిగింది. జాక్సన్ విల్లె నుంచి న్యూయార్క్ వెళ్లడానికి రన్‌వేపై సిద్ధంగా ఉన్న విమానంలో ఇలా జరిగింది.