Telugu-worker-died-in-Saudi

కారు ఢీకొని.. సౌదీలో తెలంగాణవాసి మృతి..

జెడ్డా: సౌదీ అరేబియాలోని అభా ప్రాంతంలో రహదారులు శుభ్రం చేసే సంస్థలో పనిచేస్తున్న ఓ తెలంగాణవాసి మృత్యువాతపడ్డాడు. జగిత్యాల జిల్లా పెగడపల్లికి చెందిన కొమటం కొమరయ్య.. కొండప్రాంతమైన అభాలో గత మూడు సంవత్సరాలుగా రోడ్లు ఊడ్చే ఉద్యోగం చేస్తున్నాడు. శనివారం ఉదయం తన పని చేసుకుంటున్న కొమరయ్యను వేగంగా వచ్చిన ఓ కారు ఢీకొట్టింది. హటాత్తుగా జరిగిన ఈ పరిణామాన్ని చూసి అతని తోటి ఉద్యోగులు విస్తుపోయారు. వారు తేరుకునేలోపే ఆ కారు చాలా దూరం వెళ్లిపోయింది. ఈ ప్రమాదంలో కొమరయ్య అక్కడికక్కడే మరణించినట్లు సమాచారం.