Telugu-student-died-in-an-accident-in-USA

అమెరికాలో తెలుగు యువకుడి దుర్మరణం

  • మరో భారతీయ విద్యార్థి కూడా మృతి
వాషింగ్టన్‌: అమెరికాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఇద్దరు భారతీయ విద్యార్థులు దుర్మరణం పాలయ్యారు. మృతుల్లో ఒకరిని విజయవాడకు చెందిన వైభవ్‌ గోపిశెట్టి(26)గా గుర్తించారు. టెనస్సీ స్టేట్‌ యూనివర్సిటీలో వైభవ్‌ ఫుడ్‌ సైన్సె్‌సలో పీహెచ్‌డీ చేస్తున్నారు. అక్కడే ఎమ్మెస్‌ చేస్తున్న జూడీ స్టాన్లీ పినీరియో(23)తో కలసి గురువారం రాత్రి ఓ పార్టీకి వెళ్లారు. అక్కడినుంచి తిరిగి వస్తుండగా వారు ప్రయాణిస్తున్న కారును ఓ ట్రక్కు ఢీ కొట్టింది.
 
ఈ ఘటనలో వారిద్దరూ అక్కడికక్కడే మృతిచెందారు. ప్రమాదానికి కారణమైన ట్రక్కు డ్రైవర్‌ డేవిడ్‌ టోర్రెస్‌ వాహనం అక్కడే వదిలి పరారైనట్లు పోలీసులు పేర్కొన్నారు. కాగా, తమ యూనివర్సిటీకి చెందిన ఇద్దరు భారతీయ విద్యార్థులు మృతిచెందడం పట్ల టీఎ్‌సయూ తీవ్ర సంతాపం ప్రకటించింది. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేసింది. ఈ ఘటన దురదృష్టకరమని, అట్లాంటాలోని భారత రాయబార కార్యాలయం బాధిత కుటుంబాలకు అవసరమైన సహాయాన్ని అందజేస్తోందని అధికారులు పేర్కొన్నారు.