Telugu-Man-Stuck-in-Malaysia-For-10-Years

మలేషియాలో పదేళ్లుగా యజమానుల నిర్భందంలో తెలుగు వ్యక్తి.. స్వదేశానికి రప్పించాలంటూ కూతురు...

సుభాష్‌నగర్(నిజామాబాద్): తన తండ్రి మలేషియాలో పదేళ్లుగా దుర్భర జీవితం గడుతున్నాడని, వెంటనే స్వదేశానికి రప్పించడానికి చర్యలు తీసుకోవాలని నిజామాబాద్‌ జిల్లా భీంగల్‌ మండలం చేంగల్‌కు చెందిన బోడె అశోక్‌ కూతురు అవిరళ కోరారు. మంగళవారం నిజామాబాద్‌లో ఆమె విలేకరులతో మాట్లాడారు. తాము ముగ్గురం ఆడపిల్లమని, తమ పోషణ కోసం తమ నాన్న మలేషియాకు వెళితే అక్కడి యజమానులు తిరిగి రాకుండా ఇబ్బందులకు గురిచేస్తున్నారని పేర్కొంది. తన తండ్రి తిరిగి రావడానికి అవసరమైన ఏర్పాట్లు చేయాలని ఆమె రాష్ట్ర ప్రభుత్వాన్ని వేడుకుంది.