Telugu-man-died-in-Malaysia

ఉపాధి కోసం వెళ్లి.. తిరిగిరాని లోకాలకు తెలుగువాడు..

నిజామాబాద్‌(ఖిల్లా), జూన్‌ 18: కుటుంబాన్ని బాగా చూసుకోవాలనే కోరికతో మలేసియా గడపతొక్కాడతను. కానీ ఆ కోరిక తీరకుండానే అతని జీవితం కడతేరింది. ఉద్యోగానికి సంబంధించిన ఇంటర్వ్యూకు వెళ్లి తిరిగొస్తుండగా మృత్యుశకటంలా వచ్చిన ఓ కారు అతన్ని ఢీకొంది. రెండు రోజుల క్రితం జరిగిన ఈ ప్రమాదంలో నిజామాబాద్‌ జిల్లా కేంద్రంలోని ఆటోనగర్‌కు చెందిన షేక్‌అహ్మద్‌ (41) మృతి చెందాడు. అహ్మద్‌ ఐదు నెలల క్రితం ఉపాధి కోసం మలేసియా వెళ్లాడు. ఆయనకు నలుగురు పిల్లలున్నారు. పేద కుటుంబానికి చెందిన అహ్మద్‌ మృతదేహాన్ని స్వదేశానికి తెప్పించుకునేందుకు కూడా తమకు స్థోమత లేదని, ఈ విషయంలో తమకు తోడ్పాటునందించాలని మృతుడి కుటుంబ సభ్యులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.