Telugu-Man-Body-in-Saudi-from-one-month-

నెల రోజులుగా సౌదీలోనే తెలంగాణ వాసి మృతదేహం.. కన్నీరుమున్నీరవుతున్న కుటుంబ సభ్యులు

మోపాల్(నిజామాబాద్): బతుకుదెరువు కోసం సౌదీ వెళ్లిన నిజామాబాద్‌ జిల్లా మోపాల్‌ మండలం ముదక్‌పల్లి వాసి మచ్చ సాయిలు(50) గుండెపోటుతో మరణించి నెల రోజులు దాటినా మృతదేహం స్వదేశానికి రాక కుటుంబీకులు కన్నీరుమున్నీరవుతున్నారు. సాయిలు మూడేళ్ల క్రితం సౌదీ అరేబియాకు వెళ్లాడు. డ్యూటీ ముగించుకొని వచ్చిన సాయిలు తన రూమ్‌లోనే గత నెల 20న రాత్రి గుండెపోటుతో మరణించాడు. మృతదేహాన్ని తొందరగా స్వగ్రామానికి రప్పించాలని సాయిలు కుటుంబ సభ్యులతో పాటు గ్రామ టీఆర్‌ఎస్‌ పార్టీ నాయకులు, నిజామాబాద్‌ రూరల్‌ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్‌ను ఆశ్రయించారు. పాలకులు, అధికారులు వెంటనే స్పందించి తన భర్త శవాన్ని రప్పించేలా చూడాలని సాయిలు భార్య పద్మ కోరుతోంది.