TDP-Leader-going-to-Dubai

గల్ఫ్‌కు ఎమ్మెల్యే గొల్లపల్లి పయనం

 

మలికిపురం, ఫిబ్రవరి 19: ప్రవాసాంధ్రుల ఓట్ల కోసం తెలుగుదేశం పార్టీ ఆదేశాలమేరకు దుబాయ్‌, కువైట్‌, బెహరాన్‌ దేశాలకు బుధవారం బయలుదేరి వెళుతున్నట్లు రాజోలు ఎమ్మెల్యే గొల్లపల్లి సూర్యారావు తెలిపారు. అయిదుగురు సభ్యుల బృందంలో మంత్రులు కొల్లు రవీంద్ర, ఆదినారాయణరెడ్డి, ఎన్నారై కమిటీ అధ్యక్షుడు డాక్టర్‌ రవి, గుంటూరుకు చెందిన బుచ్చు రాంప్రసాద్‌ వెళుతున్నట్లు తెలిపారు. 21, 22, 23 తేదీల్లో ఆయా దేశాల్లో పర్యటించి అక్కడ నుంచే ఓట్లు ఏవిధంగా వేయాలో తెలియజేయనున్నామన్నారు. ఇప్పటికే  పార్టీ వీటిపై తగు ఏర్పాట్లు చేసినట్లు ఆయన తెలిపారు. 

కలెక్టర్‌ను కలిసిన ఎమ్మెల్యే గొల్లపల్లి:రాజోలు ఎమ్మెల్యే గొల్లపల్లి సూర్యారావు ఎన్నికల కోడ్‌ రానున్న నేపథ్యంలో సోమవారం రాత్రి కలెక్టర్‌ కార్తికేయ మిశ్రాను కలిసి నియోజకవర్గ సమస్యలపై చర్చించారు. పలు సమస్యలపై వినతిపత్రం సమర్పించారు.