Sun-appinted-as-indian-ambassador-in-CHina

భారత్‌లో చైనా రాయబారిగా వీడాంగ్‌

బీజింగ్‌: భారత్‌లో చైనా రాయబారిగా సీనియర్‌ దౌత్యవేత్త సన్‌ వీడాంగ్‌ నియమితులయ్యారు. ఈ మేరకు చైనా ప్రభుత్వం సమాచారం అందించినట్లు బీజింగ్‌లోని బారత ఎంబసీ అధికారులు తెలిపారు. దక్షిణాసియా వ్యవహారాల్లో నిపుణుడైన వీడాంగ్‌.. గతంలో చైనాలో భారత రాయబారిగా వ్యవహరించిన ప్రస్తుత విదేశీ వ్యవహారాల మంత్రి జయ్‌శంకర్‌తో కలిసి పనిచేశారు. పాకిస్థాన్‌లో చైనా రాయబారిగానూ వ్యవహరించారు.