Snake-bites-women-in-beach

బీచ్‌లో పాము.. అందమైన అమ్మాయి కనిపించడంతో..

లండన్: బ్రిటన్‌లోని వూలకోంబ్ బీచ్‌కు వెళ్లిన ఓ యువతికి భయంకరమైన అనుభవం ఎదురైంది. సముద్రపు ఒడ్డున, ఇసుక తిన్నెలపై కూర్చొని ఉన్న ఆమెకు ఊహించని ప్రమాదం ఎదురైంది. ఎక్కడినుంచి వచ్చిందోగానీ ఓ పాము ఆమె పక్కన చేరింది. దాన్ని చూసిన ఆమె భయంగా కేకలేసి, పారిపోబోయింది. దాంతో ఆ పాము ఆమెను కాటేసి వెళ్లిపోయింది. విషయం తెలుసుకున్న లైఫ్‌గార్డులు వెంటనే ఆమెకు ప్రథమ చికిత్స అందించారు. అంబులెన్సును పిలిపించి ఆమెను ఆస్పత్రికి తరలించారు. అదే విధంగా మరో చోట రోడ్డుపై నడుస్తున్న ఓ కుక్క పొరబాటున ఓ పాముపై కాలు వేసింది. ఆ పాము కాటు అందుకున్న ఆ శునకం రెండ్రోజులపాటు ఆస్పత్రిలో మృత్యవుతో పోరాడి ప్రాణాలతో బయటపడింది. ఎండాకాలం రావడంతో పాముల వంటి క్షుద్రజీవులు ఇలా బయటకు వస్తున్నాయని నిపుణులు చెప్తున్నారు. వీటి విషయంలో అప్రమత్తంగా ఉండాలని ప్రజలను హెచ్చరిస్తున్నారు.