Slow-Motion-Video-Captures-Spectaculor-Lightning

ఆకాశంలో మెరుపులను స్లో మోషన్ వీడియో తీసిన అమెరికన్.. సోషల్ మీడియాలో వైరల్

టెక్సాస్: అమెరికాలో తుఫాను బీభత్సం సృష్టించింది. అనేక రాష్ట్రాలలో తుఫాను కారణంగా ఇప్పటివరకు ఐదుగురు ప్రాణాలు కోల్పోయినట్టు తెలుస్తోంది. డల్లాస్‌లోని ఓ ప్రాంతంలో భారీ క్రేన్ కుప్పకూలడంతో ఓ మహిళ మృతిచెందింది. టెక్సాస్ రాష్ట్రంలో ఉరుములు మెరుపులతో భారీ వర్షాలు కురిశాయి. టెక్సాస్‌లోని స్పైస్‌వుడ్ నగరానికి చెందిన ఓ ఫొటోగ్రాఫర్ ఆకాశంలో ఉన్న మెరుపులను తన ఫోన్‌లో బంధించాలనే కోరికతో తీసిన వీడియో నెటిజన్లను ఆకట్టుకుంటోంది. ఐఫోన్‌లోని స్లో మోషన్ వీడియో ద్వారా తీసిన వీడియోలో మెరుపులు ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి వెళ్లడం స్పష్టంగా కనపడుతోంది. తుఫాను కారణంగా తమ ప్రాంతంలో ఆదివారం రాత్రంతా ఉరుములు ఉరుముతూనే, మెరుపులు మెరుస్తూనే ఉన్నాయని ఫొటోగ్రాఫర్ చెప్పాడు. ఒక మెరుపు తన ఇంటి దగ్గర నుంచి ఐదు మెళ్ల దూరానికి తాకడం చూశానన్నాడు. ఇదే సమయంలో ఆ మెరుపులను తన ఫోన్‌లో బంధించాలనే కోరికతో చాలా వీడియోలు తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసినట్టు తెలిపాడు. 

Video Source: 

 

Related Articles