slashes-flight-Services-to-Dubai

దుబాయ్‌కి నిలిచిపోనున్న విమాన సర్వీసులు

దుబాయ్: దుబాయ్ వెళ్లే విమానాలు నిలిచిపోయాయి. అలాగే  విమాన సర్వీసులు కూడా తగ్గించేశారు. మార్చి నెల చివరి దాకా విమాన సర్వీసులు అందుబాటులో ఉండబోవని జెట్ ఎయిర్‌వేస్ సంస్థ ప్రకటించింది. అలాగే సోమవారం కొన్ని విమాన సర్వీసులు నిలిపోనున్నాయని ఇత్తెహద్ ఎయిర్‌పోర్టు అధికారులు తెలిపారు. ముఖ్యంగా ఢిల్లీ, అబుదాబిల మధ్య విమాన సర్వీసులు తగ్గనున్నాయన్నారు. మరమతుల కారణంగానే విమాన సర్వీసులు సోమవారం నిలిపేస్తున్నామని అధికారులు చెబుతున్నారు. మరమతులు పూర్తయిన వెంటనే యధావిథిగా విమాన సర్వీసులు నడుపుతామని ఇత్తెహద్ అధికారులు చెప్పారు. ఇదిలావుండగా జెట్ ఎయిర్‌వేస్ విమాన సర్వీసులు నిలిచిపోవడానికి మరో కారణం ఆర్థిక సమస్యలు కూడా ఉన్నాయని అధికారులు తెలిపారు.