Shamshabad-Airport-Officials-Shock-after-Checking-Luggage-of-Abu-Dhabi-Passenger

అబుదాబి నుంచి వచ్చిన విమానం.. అనుమానాస్పదంగా కనిపించిన ప్రయాణికుడి బ్యాగును తనిఖీ చేస్తే..

విమానాశ్రయంలో విదేశీ కరెన్సీ పట్టివేత 

శంషాబాద్: విమానాశ్రయంలో మళ్లీ విదేశీ కరెన్సీ పట్టుబడింది. శుక్రవారం రాత్రి ఓ ప్రయాణికుడి వద్ద అబుదాబి, సౌదీ కరెన్సీని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అబుదాబి నుంచి వస్తున్న విమానంలో కొందరు ప్రయాణికులు ఆ దేశ కరెన్సీని రహస్యంగా తీసుకొస్తున్నట్లు అధికారులకు సమాచారం అందింది. విమానం దిగి బయటకు వస్తున్న ప్రయాణికులపై నిఘా పెట్టారు. ఓ ప్రయాణికుడు అనుమానాస్పదంగా కనిపించడంతో అతడి బ్యాగ్‌ తనిఖీ చేశారు. 45 వేల అబుదాబి, సౌదీ రియాల్స్‌ లభించాయి. వాటి విలువ భారత దేశ కరెన్సీ ప్రకారం రూ. 8.57 లక్షలు ఉంటుందని తెలిపారు. విచారణ నిమిత్తం అతడిని అదుపులోకి తీసుకున్నారు. వారం రోజుల క్రితం ఇద్దరు ప్రయాణికుల వద్ద పెద్దమొత్తంలో సౌదీ రియాల్స్‌ లభించిన విషయం తెలిసిందే. విమానాశ్రయంలో వరుసగా విదేశీ కరెన్సీ పట్టుబడడం గమనార్హం.