Shakira-and-Jennifer-Lopez-weren’t-paid-for-their-show

పాప్‌ టాప్‌స్టార్ల ఫ్రీ షో..!

మియామి: పాప్‌ టాప్‌ స్టార్లు జెన్నిఫర్‌ లోపెజ్‌ (50), షకీరా (43) ఒక్క ప్రదర్శనకు రూ.కోట్లలో చార్జ్‌ చేస్తుంటారు. అలాంటిది గత ఆదివారం ఇక్కడ జరిగిన సూపర్‌ బౌల్‌ ఫుట్‌బాల్‌ మ్యాచ్‌ మధ్యలో నిర్వహించిన షోకు వారు ఒక్క రూపాయి కూడా తీసుకోలేదు! కారణం..ఈ మ్యాచ్‌కుండే వీక్షకుల సంఖ్యే. అమెరికా వ్యాప్తంగా ఈ మ్యాచ్‌ను కోట్లాదిమంది వీక్షిస్తారు. దాంతో కేవలం 15 నిమిషాలకంటే తక్కువగా ఉండే ఈ షోలో ప్రదర్శన ఇచ్చేందుకు ప్రపంచ వ్యాప్తంగా పాప్‌స్టార్లు క్యూ కడుతుంటారు. ఈ ప్రదర్శనలో పాడే పాటలకు ఉండే క్రేజ్‌ అంతా ఇంతాకాదు. షోలో లోపెజ్‌, షకీరా పాడిన పాటల ఆల్బమ్‌ల అమ్మకాలు ఏకం గా 1013 శాతం పెరిగాయి. ఇకపోతే షకీరా హిట్‌ సాంగ్‌ ‘అంపైర్‌’ అమ్మకాలు అత్యధికంగా 2,135 శాతం పెరిగాయి. షోలో లోపెజ్‌ 11 ఏళ్ల కూతురు ఎమే కూడా పాల్గొంది.