Seven-Killed-in-America-Shooting

అమెరికాలో మరోసారి కాల్పుల మోత.. ఏడుగురి మృతి

లాస్‌ ఏంజెలిస్‌: అమెరికాలో సోమవారం రెండు వేర్వేరు కాల్పుల ఘటనల్లో ఏడుగురు మృతి చెందారు. ఫ్రెస్నో పట్టణంలో ఫుట్‌బాల్‌ మ్యాచ్‌ సందర్భంగా జరిగిన ఘర్షణ కాల్పులకు దారి తీసింది. 35 మందిపై ఓ వ్యక్తి విచక్షణా రహితంగా జరిపిన కాల్పుల్లో నలుగురు మృతి చెందగా ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. ఒక్లహోమా రాష్ట్రం డంకన్‌ పట్టణంలో వాల్‌మార్ట్‌ స్టోర్‌ బయట జరిగిన మరో కాల్పుల ఘటనలో ముగ్గురు మృతి చెందారు.