sensational-decision-in-America-orders-to-halt-death-penalty

737మంది మరణశిక్షలు నిలిపేస్తున్నా

వాషింగ్టన్: కాలిఫోర్నియా గవర్నర్ సంచలన ప్రకటన చేశారు. మరణశిక్షలను నిలిపివేస్తూ చరిత్రాత్మక నిర్ణయం తీసుకున్నారు. కాలిఫోర్నియా గవర్నర్ గవిన్ న్యూసమ్ ప్రకటనపై దేశ వ్యాప్తంగా విపరీతమైన చర్చ జరుగుతోంది. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 737 మంది నేరస్థులకు మరణ శిక్షలను నిలిపివేస్తూ ఆయన నిర్ణయం తీసుకున్నారు. ‘తోటి మనిషిని చంపే హక్కు మనకు ఉందా? లేదని నేను అనుకుంటున్నాను. మరణశిక్ష పడిన 737 ఖైదీల్లో ఎంతోమంది అమాయకులున్నారు. వారికి శిక్ష పడుతుందన్న ఊహే నాకు నిద్రపట్టనివ్వట్లేదు. అందుకే వారందరి మరణ శిక్షలను నిలిపివేస్తున్నాను..’ అని గవిన్ ఓ ప్రకటనలో పేర్కొన్నారు. 

 
ప్రపంచ దేశాలన్నీ మరణ శిక్షను రద్దు చేసి.. నేరస్థుల్లో పరివర్తన తేవాలని ప్రయత్నిస్తున్నాయని ఈ సందర్భంగా కొందరు మానవతావాదులు హర్షం వ్యక్తం చేశారు. గవిన్ నిర్ణయాన్ని ప్రజలంతా స్వాగతిస్తారన్నారు. తప్పు చేసిన వారిని చంపే బదులు.. వారిలో పరివర్తన తేవాలనీ, అది వారికి మరో జన్మను ప్రసాదించిన దాంతో సమానమని స్పష్టం చేశారు.