Schoolgirl-Films-Father-Attacking-Mother-Which-Put-him-Behind-Bars

తల్లిని తండ్రి హింసించడం చూడలేక.. కూతురు ఏం చేసిందో చూడండి...

యూకే: ఇంట్లో తల్లిదండ్రులు గొడవ పడుతుంటే పిల్లలకు ఏం చేయాలో అర్థం కాదు. పేరెంట్స్ గొడవపడి కొట్టుకుంటుంటే చిన్న పిల్లలైతే భయపడిపోయి అక్కడి నుంచి పక్కకు వెళ్లి ఏడుస్తూ కూర్చుంటారు. ఇంకొంచెం ఎదిగిన పిల్లలైతే వారిని విడిపించడం చేస్తారు. కొందరు మాత్రం వీరు ఎప్పటికీ మారరని పక్కకు తప్పుకుంటారు కూడా. కాని బ్రిటన్‌కు చెందిన 15 ఏళ్ల మేసా రొసాటో క్లిఫ్టన్ అనే బాలిక తన తల్లిని గత కొంతకాలంగా హింసిస్తున్న తండ్రిని ఏకంగా జైలుకు పంపించింది. దీంతో మేసా ధైర్యాన్ని నెటిజన్లు ప్రశంసిస్తున్నారు. చాలా కాలంగా తండ్రి ఆండ్రీ క్లిఫ్టన్... తల్లి తానియా క్లిఫ్టన్‌ను కొట్టడం, తిట్టడం చేస్తుండడం చూస్తున్న మేసా ఒకరోజు చాలా గట్టి నిర్ణయమే తీసుకుంది. ధైర్యం చేసి తల్లిని తండ్రి కొడుతున్న సమయంలో మేసా తన మొబైల్‌లో వీడియో తీసింది. అనంతరం దాన్ని అంతర్జాలంలో పెట్టడంతో వీడియో వైరల్ అయింది. అది కాస్తా పోలీసుల కంటపడింది. దాంతో రంగంలోకి దిగిన పోలీసులు ఆండ్రీ క్లిఫ్టన్‌ను అరెస్ట్ చేసి కటకటాల్లోకి నెట్టారు.

ఆండ్రీ నుంచి తప్పించుకునేందుకు భార్య తానియా ఓ గదిలోపల నుంచి గడియా వేసుకొని ఉంటే బయటవైపు నుంచి తలుపు అద్దాలు పగలగొట్టి ఆమెపై దాడి చేసేందుకు యత్నించడం వీడియోలో ఉంది. మేసా మాట్లాడుతూ తండ్రి ఆండ్రీ ప్రతిరోజు తన తల్లిని క్రూరంగా హింసించడం చూడలేకపోయానని చెప్పింది. అందుకే ఒకరోజు ధైర్యం చేసి తల్లిని కొడుతుండగా వీడియో తీశానని, ఆ తరువాత స్నేహితుల సలహా మేరకు అంతర్జాలంలో పెట్టానని చెప్పింది. ఆ వీడియో కాస్తా వైరల్ కావడం, పోలీసుల కంటపడడంతో తప్పు చేసిన తండ్రి కటకటాల్లోకి వెళ్లాడని చెప్పుకొచ్చింది. ఇక ఆండ్రీ, తానియాలకు వివాహమై రెండు దశాబ్దాలకుపైగా అవుతున్న వారు గొడవ పడడం మాత్రం ఆపాలేదు. ప్రతి చిన్న విషయానికి భార్యను హింసించేవాడు ఆండ్రీ. చాలాసార్లు తానియాతో పాటు మేసా కూడా దెబ్బలు తగిలాయి. తండ్రి చర్యతో భయపడిపోయిన మేసా ఇలా వీడియో తీసి తండ్రిని జైలుకు పంపించింది. ఆండ్రీ ఎనిమిదేళ్లు కటకటాల్లోనే ఉండాలి. అయితే ఆండ్రీ జైలు నుంచి బయటకు వచ్చిన తరువాత తమను ఏమైనా చేయొచ్చని తానియా భయపడుతోంది.  

Video Source: What you see what you get