School-boy-earns-huge

యూట్యూబ్‌ కోచింగ్‌తో.. రూ. 50 లక్షల సంపాదన..

లండన్: బ్రిటన్‌కు చెందిన ఓ 16 ఏళ్ల కుర్రాడు నెలల వ్యవధిలోనే లక్షాధికారి అయిపోయాడు. ఎలానో తెలుసా? యూట్యూబ్ చూసి. ఫారెక్స్ ట్రేడింగ్ (వివిధ దేశాల కరెన్సీలతో చేసే ట్రేడింగ్) తో చాలా మంది బాగా డబ్బు సంపాదిస్తున్నారని తెలుసుకున్న ఎడ్వర్డ్ టర్నర్.. తాను కూడా అదే పని చేద్దామని నిశ్చయించుకున్నాడు. అయితే అప్పటికే ఆ బిజినెస్‌లో ఉన్న ఓ వ్యక్తి.. ఎవరైనా సీనియర్ బిజినెస్ అనలిస్ట్ వద్ద శిక్షణ తీసుకోకుండా ట్రేడింగ్ వ్యాపారంలో అడుగుపెడితే ఏమీ సాధించలేమంటూ టర్నర్‌ను నిరాశపరిచాడు. దీన్ని ఛాలెంజ్‌గా తీసుకున్న టర్నర్.. రోజుకు 5 గంటలపాటు యూట్యూబ్‌లో ఫారెక్స్ ట్రేడింగ్‌ గురించిన వీడియోలే చూశాడు. అలా ఈ ట్రేడింగ్‌పై పట్టుసాధించి.. తొలిసారి 150 పౌండ్లు(సుమారు రూ.14000) పెట్టుబడి పెట్టాడు. ఆ డబ్బుతో వ్యాపారం చేస్తూ చివరకు ఎనిమిది నెలల్లోనే ఆ సొమ్ముకు 40 రెట్లు సంపాదించాడు. అవునండీ ఇప్పుడతని వద్ద ఉన్న సొమ్ము  రూ. 55 లక్షలపైమాటే. తనకు డ్రైవింగ్ లైసెన్సు వచ్చేనాటికి రూ.27 లక్షలు పెట్టి మెర్సిడెస్ కారు కొనుక్కోవాలని అనుకుంటున్నట్లు చెప్పాడు.