Scentence-rule-in-Saudi

సౌదీలో ఈ 16 తప్పులకు తల నరకడమే..!

సౌదీ: మహిళలపై ఆంక్షలను సడలిస్తూ.. పలు సంచలన నిర్ణయాలు తీసుకుంటున్న సౌదీ.. చట్టాల విషయంలో, పలు నేరాలకు విధించే శిక్షల విషయంలో మాత్రం కాస్త కఠినంగానే ఉంటోంది. ఆ విషయం సౌదీ అమలు చేసిన మరణ శిక్షల లెక్క చూస్తే ఎవరైనా ఒప్పుకోవాల్సిందే. కొన్ని కొన్ని నేరాలకు గానూ నేరస్థులకు ఇతర దేశాలు సాధారణ శిక్షలతో వదిలేస్తే.. సౌదీ మాత్రం తల తెగ్గొడుతుంది. బహిరంగంగానే శిక్షలను అమలు చేస్తుంటుంది.  పొట్టకూటి కోసం భారత్ నుంచి సౌదీకి వెళ్లే వారి సంఖ్య యేటేటా పెరుగుతోంది. కష్టమైనా నష్టమైనా కొద్ది కాలం పాటు భరిస్తే.. జీవిత కాలమంతా కుటుంబం బాగుంటుందనే ఆశతో వారంతా సౌదీకి వలస వెళ్తున్నారు. ఈ క్రమంలో చట్టాలపై కనీస అవగాహన లేకుండా.. చిన్న చిన్న తప్పులు, పొరపాట్లు చేసి జైలు పాలవుతున్న భారతీయుల సంఖ్య ఇటీవల పెరుగుతూ వస్తోంది. కొందరు తప్పులు చేసి కేసుల్లో చిక్కుకుంటోంటే.. మరికొందరు ప్రవాసులు అమాయకంగా మోసపోయి కేసుల్లో ఇరుక్కుపోతున్నారు. అందుకే చట్టాలపై  అవగాహన ఏర్పరచుకుంటే సౌదీలో వలసదారులు ప్రాణభయం లేకుండా ఉండొచ్చు.

 

ఒక్కో చోట ఒక్కో  కేసుకు.. విధించే శిక్ష ఒక్కోలా ఉంటుందనడంలో ఏమాత్రం సందేహం లేదు. ఒక దేశంలో ఓ తప్పునకు.. మరణశిక్ష విధిస్తే.. మరో దేశంలో అదే తప్పునకు సాధారణ శిక్ష విధించవచ్చు.. అసలు అది తప్పే కాకపోవచ్చును కూడా.  సౌదీలో మరణ శిక్ష విధించే శిక్షల జాబితాను పరిశీలిస్తే.. వీటికి కూడా మరణశిక్ష విధిస్తారా..? అన్న ఆశ్చర్యం కలగకమానదు. మతం మారడం వంటి అంశం భారత్‌లో శిక్షార్హమైనది ఏమాత్రం కాదు.. కానీ సౌదీలో మతం మారితే మరణశిక్ష విధిస్తారు. వ్యభిచారానికి అమెరికాలో ఆరు నెలల నుంచి అయిదేళ్ల వరకు శిక్ష విధిస్తారు.. కానీ సౌదీలో మాత్రం వ్యభిచారానికి మరణశిక్ష విధిస్తారు. ఓ పదహారు రకాల కేసులకు గానూ.. శిక్షల్లో అగ్రరాజ్యమైన అమెరికాకు, రాచరిక పాలన ఉన్న సౌదీకి మధ్య చాలా వ్యత్యాసం కనిపిస్తుంది. ఆ కేసుల్లో శిక్షల మధ్య తేడా ఏంటో ఓ లుక్కేయండి.. 

నేరం ================= అమెరికా =================  సౌదీ
1. ప్రతీకార హత్య ================= ఉరిశిక్ష / జీవిత ఖైదు ================= మరణశిక్ష
2. సాధారణ హత్య ================= 20 ఏళ్ల జైలు శిక్ష ================= మరణశిక్ష
3. టెర్రరిస్టులతో సంబంధాలు ================= అయిదేళ్ల జైలు శిక్ష ================= మరణశిక్ష 
4. అత్యాచారం, వేధింపులు ================= 8 ఏళ్ల జైలు శిక్ష ================= మరణశిక్ష
5. వ్యభిచారం ================= తీవ్రమైన నేరం కాదు ================= మరణశిక్ష
6. దేశద్రోహం ================= జీవిత కాల శిక్ష ================= మరణశిక్ష
7. గే సెక్స్ ================= అస్సలు నేరం కాదు ================= మరణశిక్ష
8. ఆస్తుల దహనం ================= 7-40 ఏళ్ల జైలు శిక్ష ================= మరణశిక్ష
9. దొంగతనం ================= 2.9 ఏళ్ల జైలు శిక్ష ================= మరణశిక్ష
10. దోపిడి ================= 10 నెలల నుంచి 2.5 ఏళ్ల శిక్ష ================= మరణశిక్ష
11. డ్రగ్స్ సరఫరా, తయారీ ================= 5 ఏళ్ల జైలు శిక్ష ================= మరణశిక్ష
12. డ్రగ్స్ తీసుకోవడం ================= మూడేళ్ల జైలు శిక్ష ================= మరణశిక్ష
13. మతం మారడం ================= నేరం కాదు================= రణశిక్ష
14. గూఢచర్యం చేయడం ================= 17.5 ఏళ్ల జైలు శిక్ష ================= మరణశిక్ష
15. మత్తుపదార్థాలు సేవించడం ================= నేరం కాదు (డ్రగ్స్ తప్ప) ================= మరణశిక్ష
16. మంత్రవిద్య ================= నేరం కాదు ================= మరణశిక్ష