Saudi-govt-good-news-

ముస్లింలకు సౌదీఅరేబియా సర్కారు శుభవార్త

రియాద్ : ప్రపంచవ్యాప్తంగా ఉన్న ముస్లింలకు సౌదీఅరేబియా దేశం శుభవార్త వెల్లడించింది. ముస్లింల ఉమ్రా యాత్రకు సౌదీ వీలు కల్పించేలా వీసాల జారీ సంఖ్యను పెంచింది. ఈ ఏడాది 2.664 మిలియన్ల మంది ముస్లిమ్ భక్తులకు ఉమ్రా వీసాలు జారీ చేయాలని సౌదీ సర్కారు నిర్ణయించింది. గత ఏడాది కంటే 2.79 శాతం అధికంగా ఉమ్రా వీసాలు జారీ చేయాలని సౌదీ ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పటికే 2.250 మిలియన్ల మంది భక్తులు ఉమ్రా యాత్ర చేశారని సౌదీ హజ్, ఉమ్రా మంత్రిత్వశాఖ వెల్లడించింది.