Sagrada-Familia-finally-gets-building-permit-after-137-years

137 ఏళ్ల తరువాత బయటపడిన నిజం..

 స్పెయిన్‌ దేశంలోని బార్సిలోనా నగరంలో ఉన్న సగరాడా ఫమిలా సుప్రసిద్ధ క్రైస్తవ ప్రార్ధనా మందిరం. రోజూ కొన్ని వేలమంది దాన్ని సందర్శిస్తూ ఉంటారు. 2005లో యునెస్కో దీన్ని ప్రపంచ వారసత్వ ప్రదేశంగా గుర్తించింది. సగరాడా ఫమిలా నిర్మాణం 1882లో మొదలయింది. మూడేళ్ళ కిందట ఒక సందర్భంలో అధికారుల దృష్టికి వచ్చిన విషయం ఏమిటంటే... ఈ చారిత్రక భవన నిర్మాణానికి అనుమతి లేదని! ఎందుకు తీసుకోలేదని నిర్వాహకుల్ని అడిగితే, ‘‘దాని నిర్మాణం ఇంకా పూర్తి కాలేదు. బార్సిలోనాను అనుకొని ఉన్న చిన్న గ్రామంలో ఈ పనులు మొదలయ్యాయి. 1885లో అనుమతి కోసం డిజైనర్‌ దరఖాస్తు చేశారు. కానీ సమాధానం రాలేదు!’’ అని చల్లగా చెప్పారు. ‘ఇన్నేళ్ళుగా ‘అక్రమ నిర్మాణం’గా ఉన్న ఈ భవనాన్ని ఎలా వదిలేశాం?’ అని అధికారులు తలలు పట్టుకున్నారు. ఎన్నో మల్లగుల్లాలు పడి చివరకు కిందటి వారంలో అనుమతి ఇచ్చేశారు. త్వరగా నిర్మాణాన్ని పూర్తి చెయ్యాలని కమిటీకి ఆదేశాలిచ్చారు. అదీ సంగతి!