Russian-military-cadets-sing-Mohammed-Rafis-song

రఫీ పాట.. రష్యా సైనికుల నోట!

ముంబై: బాలీవుడ్‌ దిగ్గజ గాయకుడు మహమ్మద్‌ రఫీ పాడిన ప్రఖ్యాత దేశభక్తి గీతం ‘ఆయే వతన్‌’ను రష్యా సైనికుల బృందం ఆలపించింది. ఈ బృందం రష్యా రాజధాని మాస్కోలో 27 సెకన్ల పాటు పాడిన ఈ వీడియో వైరల్‌ అయింది. ఈ పాట 1965లో భగత్‌ సింగ్‌ జీవిత కథ ఇతివృత్తంతో నిర్మించిన ‘షహీద్‌’ సినిమాలోనిది.