Real-Estate-Agent-Raped-Woman-

ఇల్లు చూపిస్తానంటూ పిలిచి.. అత్యాచారం చేసిన రియల్ ఏజెంట్

కాలిఫోర్నియా: అమెరికాలో స్థిరపడాలనే కోరికతో కాలిఫోర్నయా చేరుకున్న ఓ మహిళను చైనా మూలాలున్న ఓ వ్యక్తి దారుణంగా మోసగించాడు. ఇల్లు చూపిస్తాను రమ్మంటూ తీసుకె్ళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ విషయం ఎవరికీ చెప్పొద్దని బెదిరించాడు. పోలీసులకు చెప్పినా వారు ఆమె మాట వినరని, ఎందుకంటే పోలీసు శాఖ మొత్తం తన  మిత్రులేనని చెప్పాడు. అతని మాటలకు భయపడిన ఆమె వెంటనే చైనాకు తిరుగు ప్రయాణమైంది. అయితే వెళ్లబోయే ముందు కాలిఫోర్నయా పోలీసులకు జరిగిన విషయం చెప్పింది. దాంతో పోలీసులు చైనాకు చెందిన వెన్‌వర్త్ హువాంగ్ వాంగ్ అనే 38 ఏళ్ల వ్యక్తిని అరెస్టు చేశారు. అతనిపై అత్యాచారం కేసు నమోదు చేసి కోర్టు ముందు హాజరుపరిచారు. వాంగ్ గతంలో కూడా ఇలాంటి పనులు చేశాడని, ముగ్గురు మహిళలపై అత్యాచారానికి పాల్పడ్డాడని వారు తెలిపారు. తప్పు చేసిన వారు ఎంతటి వారైనా వదిలే ప్రసక్తి దని స్పష్టం చేశారు.